Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటుడి చెంప పగలగొట్టిన 'బాహుబలి' ఐటెం గర్ల్!

అఖండ విజయం సాధించిన 'బాహుబలి' సినిమాలో 'మనోహరి' అనే పాటలో మైమరపించిన ఐటెం గర్ల్ స్కార్లెట్ విల్సన్ తోటి నటుడి చెంపను ఛెళ్లుమనిపించింది. బాలీవుడ్ సినిమా 'హన్స: ఏక్ సన్యోగ్' అనే సినిమా షూటింగ్ లో ఈ ఘటన సంభవించింది. వివరాల్లోకి వెళ్తే, షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉమాకాంత్ రాయ్ అనే నటుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట. తాక కూడని చోట తాకడమే కాక, ఆమె జుట్టు పట్టుకుని లాగాడట.

దీంతో, ఆగ్రహానికి గురైన స్కార్లెట్... ఉమాకాంత్ చెంపను పగలగొట్టింది. ఈ ఘటనతో అతను అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయాడు. యూనిట్ సభ్యులు కూడా అతన్ని బలవంతంగా బయటకు పంపించేశారు. మరోవైపు అతనిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసి, నటుడిగా అతడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరనున్నట్టు సమాచారం.

More Telugu News